ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''జగన్​ బయోపిక్ టైటిల్ 420'' - జగన్

12 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న వైకాపా నేత జగన్​ స్వీయచరిత్రను.. 420 పేరుతో తీయాలని విప్ బుద్ధా వెంకన్న అన్నారు. వైకాపా బీసీ గర్జనకు జనం లేక పక్క రాష్ట్రం నుంచి తరలించారని ఎద్దేవా చేశారు.

విజయవాడలో బుద్ధా వెంకన్న

By

Published : Feb 18, 2019, 7:56 PM IST

విజయవాడలో బుద్ధా వెంకన్న
తెదేపాలో ఉంటూ ప్రజాభివృద్ధికి అడ్డుపడిన నాయకులే వైకాపాలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలో మాట్లాడిన ఆయన వైకాపా బీసీ గర్జనకు తెలంగాణ నుంచి జనాన్ని తరలించారని ఆరోపించారు. ప్రస్తుతం బయోపిక్​ల కాలం నడుస్తోందన్న వెంకన్న.. 12 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ స్వీయచరిత్రకు 420 అని పేరు పెట్టాలని ఎద్దేవా చేశారు. జగన్, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అయిదేళ్లలో సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధికి.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తరువాత జగన్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details