ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో జగన్‌ నెంబర్ వన్: నారా లోకేశ్​ - వైకాపా పై ట్వీటర్ వేదికగా మండిపాటు

ముఖ్యమంత్రి జగన్​ తీరుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ట్విటర్​ వేదికగా మండిపడ్డారు. తండ్రి హయాంలో ఐఏఎస్​లను జైలుకు పంపిస్తే.. ఇప్పుడు ఐపీఎస్​లను కోర్టు మెట్లెక్కిస్తున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను తమ సొంతానికి వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.

వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో జగన్‌ నెంబర్ వన్
వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో జగన్‌ నెంబర్ వన్

By

Published : Mar 13, 2020, 8:37 PM IST

సీఎం జగన్​పై ట్విటర్​ వేదికగా మండిపడ్డ నారా లోకేశ్​

వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో ముఖ్యమంత్రి జగన్​ నెంబర్ వన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. తండ్రి హయాంలో తప్పుడు పనులు చేసి ఐఏఎస్​లను జైలుకు పంపిస్తే... ఇప్పుడు ఐపీఎస్​లను కోర్టు మెట్లు ఎక్కించి చీవాట్లు పెట్టిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినందుకు తెదేపా కార్యకర్తని 14 రోజులు రిమాండ్​కి పంపారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెదేపా నాయకులపై హత్యాయత్నం చేసిన వైకాపా నాయకుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను ఇంత నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే.. ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతోందా అని కోర్టులు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details