గ్రామ వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నామని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ప్రతి 2 వేల జనాభా కలిగిన గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని 11,162 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా ప్రభుత్వం మేధోమథన సదస్సు నిర్వహిస్తోంది. 'మన పాలన-మీ సూచన' పేరిట విభాగాల వారీగా సదస్సు జరుగుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల మెరుగుదలకు చర్యలు, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు.
అవినీతి లేని గొప్ప వ్యవస్థను తయారు చేశాం: సీఎం జగన్ - మా పాలన మీ సూచన తాజా వార్తలు
గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ వ్యవస్థ చక్కగా పని చేస్తోందని సీఎం జగన్ అన్నారు. అవినీతి, వివక్షకు ఎక్కడా తావులేకుండా పని చేయడం ముఖ్యమన్నారు. వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకొచ్చి ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
jagan about ysrcp 1 year governance
లక్షా 35 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర బహుశా ఎక్కడా ఉండదేమోనని జగన్ అన్నారు. 82.5 శాతం ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలే ఉన్నారన్నారు. ఏడాది తిరగకముందే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని వ్యాఖ్యానించారు. అర్హులైన వారందరికీ సంతృప్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సేవలు అందిస్తున్నామన్న సీఎం... అవినీతి లేని గొప్ప వ్యవస్థను తయారు చేశామన్నారు.
- ఇంకా సీఎం ఏం అన్నారంటే..
- గతం ప్రభుత్వం పింఛను రూ.వెయ్యి ఇస్తే, ఇప్పుడు రూ.2,250 ఇస్తున్నాం.
- పింఛన్లు రాని పరిస్థితి నుంచి నేరుగా ఇళ్ల వద్దకే పింఛను డబ్బు అందిస్తున్నాం.
- 69 లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాం.
- మనబడి, నాడు-నేడు కింద పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయి.
- ప్రతి పాఠశాల ఆంగ్ల మాధ్యమంగా మారబోతుంది.
- 21.11.2019న మత్స్యకార భరోసాకు శ్రీకారం చుట్టాం.
- మే 18 వరకు ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా బకాయిలు చెల్లించేశాం.
- వైఎస్‌ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా తోడుగా ఉంటున్నాం.
- 12.12.2019న దిశ చట్టం తీసుకొచ్చాం.
- 21.12.2019న వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం తీసుకొచ్చాం.
- 24.02.2020న జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం.
- 2020-21కు సంబంధించి క్యాలెండర్ రూపొందించాం.
- ఏప్రిల్ 2020లో పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించాం.
- వైఎస్‌ఆర్ విద్యా దీవెన కింద రూ.4243 కోట్లు అందిస్తున్నాం.
Last Updated : May 25, 2020, 4:11 PM IST