వైకాపా ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అన్నింటా 50 శాతం రిజర్వేషన్ మహిళలకే కల్పిస్తున్నామన్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువగా కూడా అమలు చేస్తామని జగన్ పేర్కొన్నారు. ఏడాదిలో 3 కోట్ల 57 లక్షల 51 వేల 614 మందికి లబ్ధి చేకూర్చమన్నారు. వీరందరి సంక్షేమానికి ఏడాదిలో రూ.40,139 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇంత పెద్దమొత్తంలో ఏ ప్రభుత్వమూ సంక్షేమ పథకాలు అమలు చేయలేదని సీఎం అన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడున్నది మహిళల ప్రభుత్వం: సీఎం జగన్ - మన పాలన మీ సూచన న్యూస్
రాష్ట్రంలో ఇప్పుడున్నది మహిళల ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. మహిళలకు అన్ని విధాలా అండగా ఉంటున్నామన్నారు.
jagan about womens role in society