రాబోయే రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను.. ఇతర పథకాలకు మళ్లించరాదని జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైకాపా ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.
సబ్ ప్లాన్ నిధులను ఇతర ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తున్నారని విమర్శించారు. వచ్చే బడ్జెట్లో జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్టీ, ఎస్టీలకు నిధులు మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.