అమరావతి ఉద్యమానికి మద్దతుగా మహిళా ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలోని గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేతలు ఆందోళనకు దిగారు. భూత్యాగాలు చేసిన రైతులు 300రోజులుగా గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని నేతలు విమర్శించారు. ఉద్యమాన్ని కించపరిచేలా వైకాపా ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు దారుణమని మండిపడ్డారు.
'అమరావతి ఉద్యమంపై వైకాపా నేతల వ్యాఖ్యలు దారుణం' - 300రోజుల అమరావతి ఉద్యమం
రాజధాని అమరావతి కోసం 300 రోజులుగా పోరాడుతుంటే... ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని మహిళా ఐకాస నేతలు మండిపడ్డారు. అమరావతి ఉద్యమానికి మద్దతుగా విజయవాడలోని గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
మహిళా జేఏసీ నిరసన
ధర్నా చౌక్ వద్ద పోతిన మహేశ్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్ వద్ద ఆందోళన చేపట్టిన వామపక్షాలు... మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినదించాయి.
ఇదీ చదవండి:అమరావతి కోసం మూడు వేల రోజులైనా ఉద్యమం చేస్తాం: నక్కా