విజయవాడ బెంజ్ సర్కిల్లోని వేదిక కల్యాణ మండపాన్ని అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యాలయంగా జేఏసీ నేతలు నిర్ణయించారు. ప్రైవేటు సమావేశ మందిరాలు, హోటళ్లలో సమావేశాలను ఇంతవరకు నిర్వహిస్తున్న సమితి ప్రతినిధులు.... ఇప్పుడు ఈ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కచ్చితమైన పరిష్కారం వచ్చేంత వరకూ ఆందోళన కొనసాగించాలని తీర్మానించారు. వేదిక కల్యాణ మండపంలో అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఐకాస ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అన్ని లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనూ పర్యటించే ఐదు బృందాల బస్సు యాత్రను తెదేపా అధినేత చంద్రబాబుతోపాటు ఇతర పార్టీల ముఖ్యనేతలు ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు.
'బెంజ్ సర్కిల్లో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం' - వేదిక కల్యాణ మండపం వార్తలు
విజయవాడలోని వేదిక కల్యాణ మండపం అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయంగా మారింది. బస్సు యాత్ర కూడా ఇక్కడి నుంచే ప్రారంభం కానుంది. రాజధాని అమరావతిపై కచ్చితమైన పరిష్కారం వచ్చే వరకూ ఆందోళన కొనసాగించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.

JAC headquarters in Benz Circle
అమరావతిపై కచ్చితమైన ప్రకటన వచ్చేంతవరకూ ఆందోళన కొనసాగుతుందన్న జేఏసీ నేతలు
ఇదీ చదవండి: