JAC LEADER BOPPARAJU ON CS SAMEER SHARMA: ఉద్యోగుల వేతనాలపై సీఎస్ సమీర్ శర్మ దుర్మార్గంగా మాట్లాడారని ఏపీ జేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఫిట్మెంట్తో జీతాలు తగ్గుతుండగా.. డీఏలు ఎరగా చూపి జీతాలు పెరిగుతాయని సీఎస్ అనడం దారుణమన్నారు. ఈ ఫిట్మెంట్ అమలు చేస్తే ప్రతి ఉద్యోగికి వేతనాలు తగ్గుతాయని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మాకు జీతాలు తగ్గవని మీరు అనుకుంటే మాకు పాత జీతాలే ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. రివర్స్ పీఆర్సీ తమకు వద్దని, ఇస్తే పాత జీతాలు ఇవ్వాలని కోరారు.
జీవోలు రద్దు చేసుకునే వరకూ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదన్నారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని.. దుర్మార్గపు ఆలోచనలకు వ్యతిరేకంగా సమ్మె చేయనున్నట్లు తెలిపారు. తమ వేతనాల పెంపు కోసం కాదని.. జీతాల్లో కోత పెట్టడం సహా గతంలో ఇచ్చిన అలవెన్సులను రద్దు చేసినందున సమ్మెకు వెళ్తున్నట్లు ఈటీవీ ముఖాముఖిలో బొప్పరాజు తెలిపారు.