కరోనా వైరస్ నివారణలో భాగంగా పోలీసులు విశేష కృషి చేస్తున్నారు. వారి సేవలను గుర్తించిన ఐటీసీ అధికారులు 12 లక్షల రూపాయల విలువ చేసే పండ్ల రసాల ప్యాకెట్లను విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుకు అందించారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు ముందు వరసలో ఉండి విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. పోలీసుల ఆరోగ్యం కోసం పండ్ల రసాలు ఉపయోగపడతాయని.. 12 వేల లీటర్ల ప్యాకెట్లను వారికి అందజేశారు. ఇప్పటికే మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, విశాఖ సీపి ఆర్.కె.మీనాలకు పండ్ల రసాల ప్యాకెట్లు అందచేసినట్లు తెలిపారు.
పోలీసులకు పండ్ల రసాలు అందజేసిన ఐటీసీ - itc sponsored fruit juice to police
లాక్డౌన్ సమయంలో పోలీసుల కష్టాన్ని గుర్తించి ఐటీసీ సంస్థ వారికి పండ్ల రసాలు అందించింది. విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావుకు 12 లక్షల విలువ చేసే పండ్ల రసాల ప్యాకెట్లు సంస్థ ప్రతినిధులు అందజేశారు.
![పోలీసులకు పండ్ల రసాలు అందజేసిన ఐటీసీ itc sponsored fruit juice to police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6885109-341-6885109-1587477046942.jpg)
పోలీసులకు పండ్ల రసాలు అందజేసిన ఐటీసీ