ప్రకృతి వైపరీత్యలు సంభవిస్తే..,ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించకపోవటం దారుణమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. తక్షణమే పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆక్షేపించారు. రహదారులకు మరమ్మతులు చేసి ప్రజాజీవనాన్ని గాడిలో పెట్టాలని చినరాజప్ప హితవు పలికారు.
'ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించకపోవటం దారుణం' - ఏపీలో వర్షాలు
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే...ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించకపోవటం దారుణమని తెదేపా నేత చినరాజప్ప విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించకపోవటం దారుణం