"పాతవాళ్లను తొలగించి.. కొత్త ఉద్యోగాలా!?" - 'Is the CM home or a private palace like Lotus Pond?'-chnadrababu on twitter
ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాలు చెప్పుకోవడానికి సీఎం దగ్గరికి వస్తుంటే... ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. అది ముఖ్యమంత్రి నివాసమా... లేక లోటస్ పాండ్ వంటి ప్రైవేట్ రాజభవనమా... అంటూ ట్వీట్ చేశారు.

ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉద్యోగులను తొలగిస్తూ.. కొత్త వాళ్లను నియమించటం ఎందుకని ప్రశ్నించారు. వాటికే ఉద్యోగాల కల్పన అని పేరు పెట్టుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీలు ఎందుకిచ్చినట్టని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగిన మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్వీటర్లో పోస్ట్ చేశారు. ఉద్యోగుల తొలగింపు లేకుండా.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.