చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేయటం పోలీసు అధికారుల సంఘానికి తగదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హితవు పలికారు. చంద్రబాబు విషయంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తొందరపాటుతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అక్రమ కేసులు నమోదు చేస్తూ...తెదేపా ఫిర్యాదులు పట్టించుకోని పోలీసులపై ప్రైవేట్ కేసులు పెట్టాలని మాత్రమే చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు.
చట్టప్రకారం పనిచేయని పోలీసులపై చర్యలు తీసుకోమనటం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులను దూషించిన వైకాపా నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని వర్ల నిలదీశారు.