భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అప్రమత్తమైంది. ప్రధాన జలాశయాలకు... ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నీటి నిర్వహణపై దృష్టి పెట్టింది. విజయవాడలో ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సమీక్షించారు. వరద, వర్షాల ప్రభావంపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం అన్ని జిల్లాల నీటిపారుదల శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టులకు భారీ వరద... జలవనరుల శాఖ అప్రమత్తం - వానలపై సమీక్షలు
విజయవాడలోని నీటిపారుదల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. వరద, వర్షాల ప్రభావంపై ఉన్నతాధికారులతో చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీటి నిర్వహణ సమర్థంగా చేపట్టాలని సూచించారు.
మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సమీక్ష