ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పలువురు ఐపీఎస్‌లకు.. సూపర్‌ టైమ్‌ స్కేల్‌ గ్రేడ్‌ ఉద్యోగోన్నతి - ips officers in andhpra pradesh

పలువురు ఐపీఎస్‌లకు.. సూపర్‌ టైమ్‌ స్కేల్‌ గ్రేడ్‌ ఉద్యోగోన్నతి
పలువురు ఐపీఎస్‌లకు.. సూపర్‌ టైమ్‌ స్కేల్‌ గ్రేడ్‌ ఉద్యోగోన్నతి

By

Published : Dec 31, 2021, 9:11 PM IST

Updated : Dec 31, 2021, 10:42 PM IST

21:05 December 31

ప్రకటించిన ప్రభుత్వం

1990,1991,1992 బ్యాచ్​లకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్​గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఏడుగురు సీనియర్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్​గా సూపర్ టైమ్ స్కేల్ గ్రేడ్ ఉద్యోగోన్నతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, మహ్మద్ ఎహసాన్ రెజా, హరీష్ కుమార్ గుప్తా, పి. సీతారామాంజనేయులు, కాసిరెడ్డి వీఎన్ రెడ్డి, నళిన్ ప్రభాత్​లకు డైరెక్టర్ జనరల్ స్థాయి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం వారు పనిచేస్తున్న స్థానాల్లోనే ఈ ఉద్యోగోన్నతితో కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది.

ఏపీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్​గా మాదిరెడ్డి ప్రతాప్, జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్​గా మహ్మద్ ఎహసాన్ రెజా, ఏపీ పోలీసు రిక్రూట్​మెంట్ బోర్డ్ ఛైర్మన్​గా హరీష్ కుమార్ గుప్తా అదే స్థానాల్లో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా పి. సీతారామాంజనేయులు, ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ గా కాసిరెడ్డి వీఆర్ఎన్ రెడ్డి కొనసాగుతారని పేర్కొంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనా సిన్హా, నళిన్ ప్రభాత్ లు ప్రస్తుతం కేంద్ర డిప్యూటేషన్​లో ఉన్నందున డైరెక్టర్ జనరల్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

మరోవైపు 2004 బ్యాచ్ కు చెందిన కేంద్ర సర్వీసుల్లో ఉన్న నవీన్ గులాటీ, విజయవాడ సీపీ కాంతిరాణ టాటా, విశాఖ రేంజ్ డీఐజీ ఎల్ కేవీ రంగారావు, కర్నూలు రేంజ్ డీఐజీ పి.వెంకట్రామిరెడ్డిలకు ఐజీపీలుగా ఉద్యోగోన్నతి కల్పించారు.

ఇవీచదవండి :

Last Updated : Dec 31, 2021, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details