"వైఎస్ వివేకా మరణం ప్రమాదవశాత్తూ జరిగిందనడం ఎంత నిజమో.. నాపై ఆరోపణలు కూడా అంతే నిజం" అని సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. తనపై రాష్ట్ర ప్రభుత్వం చేసినవన్నీ నిరాధార ఆరోపణలని, వాస్తవాలన్నింటినీ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు హాజరై వివరించినట్లు చెప్పారు. కృత్రిమ ధృవపత్రాలు సృష్టించి తనను ఇరికించారని.. ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ పూర్తైన అనంతరం తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
సుదీర్ఘ విచారణ..
కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు ఏబీ వెంకటేశ్వరరావు తుది విచారణకు హాజరయ్యారు. సచివాలయంలోని 5వ బ్లాక్లో సుదీర్ఘంగా కొనసాగిన విచారణలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులనూ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ప్రశ్నించింది. 14 రోజులుగా కొనసాగుతున్న విచారణ పూర్తయిందని, తాను కూడా సాక్ష్యాన్ని ఇచ్చానని, కమిషనర్ వాస్తవాలను పరిశీలించి నిర్ణయం చెబుతారన్నారు.