సింగపూర్‌లో ‘అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం’ జరిగింది. శ్రీ సాంస్కృతిక కళాసారథి' అనే సంస్థ ఆవిర్భావం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 దేశాల నుంచి 50 మందికిపైగా సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు వక్తులుగా ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఐదున్నర గంటల పాటు వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లేఖ ద్వారా తన శుభాభినందనలు తెలిపారు. సామవేదం షణ్ముఖశర్మ, గరికపాటి నరసింహారావు తమ సందేశాన్ని పంపించారు. 14 దేశాల నుంచి అంతర్జాలం ద్వారా ఈ విధమైన కార్యక్రమం జరగటం ఇదే మొదటిసారి కావటంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ సమ్మేళనం స్థానం సంపాదించుకుందని- తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షులు వెంకటాచారి తెలిపారు.