ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వారం రోజుల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు. బస్సు సర్వీసులు పునఃప్రారంభించే విషయమై విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చించారు. అంతర్రాష్ట్ర ఒప్పందం అమలు సహా ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే అంశంపై సమాలోచనలు జరిపారు.
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు
లాక్డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు వారం రోజుల్లో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ విషయమై విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల మధ్య కిలోమీటర్ల ప్రాతిపదికన అంతర్రాష్ట్ర బస్సులు నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ఇరు రాష్ట్రాల మధ్య కిలోమీటర్ల ప్రాతిపదికన అంతర్రాష్ట్ర బస్సులు నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే ... ఏపీలోనూ తెలంగాణ ఆర్టీసీ బస్సులు అంతే దూరం సర్వీసులు నడుపుకోవచ్చు. ఈ విధానం అమలు చేసేందుకు మరింత కసరత్తు చేయాల్సి ఉన్నందున మరోసారి భేటీ అయిన పరస్పర ఒప్పందం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చే వారం నుంచి విజయవాడ సహా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి హైదరాబాద్కు బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. నాలుగు దశల్లో బస్సులను రోడ్డెక్కించనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల పూర్తి వివరాలను ఇరు రాష్ట్రాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:రైతులను ఆదుకునేందుకు సీఎం కీలక ఆదేశాలు