ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 28, 2021, 3:12 PM IST

ETV Bharat / city

SEC: ఎస్ఈసీ నియామకంపై హైకోర్టులో విచారణ

ఎస్ఈసీ(SEC) నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని ఎస్​ఈసీగా కొనసాగడాన్ని రాజ్యంగా విరుద్దమైన చర్యగా ప్రకటించాలని గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఎస్ఈసీ నియామకంపై హైకోర్టులో విచారణ
ఎస్ఈసీ నియామకంపై హైకోర్టులో విచారణ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని కొనసాగడాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని పేర్కొంటూ గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో వేసిన పిల్ పై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికలు నిర్వహించి ..160 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం పరిషత్ ఎన్నికల రద్దుపై హైకోర్టులో విచారణ జరుగుతోందని న్యాయస్థానం తెలిపింది. ఆ పిటిషన్ పై విచారణ పూర్తి అయిన తర్వాత దీనిపై విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details