ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వరదలతో నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల - ఉద్యాన పంటలకు ఇన్​పుట్ సబ్సిడీ విడుదల వార్తలు

వర్షాల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నష్టపోయిన వ్యవసాయ పంటలకు 113 కోట్లు, ఉద్యాన పంటలకు 22 కోట్ల రూపాయల చొప్పున ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

వరదలతో నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల
వరదలతో నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

By

Published : Oct 26, 2020, 5:44 PM IST

జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో సంభవించిన వరదలు.. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గోదావరి, కృష్ణా, కుందూ నదుల వరదల ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు చేయాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. 33 శాతానికంటే ఎక్కువగా దెబ్బ తిన్న పంటలకు సబ్సిడీ విడుదలైంది. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంత జిల్లాల్లోని రైతులకు సబ్సిడీ విడుదల చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details