సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మ విజయకుమార్ రెడ్డి డిప్యుటేషన్‌ను.. మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్ 10 నుంచి 2024 జూన్ 9 వరకూ ఆయన ఏపీలో డిప్యుటేషన్‌పై కొనసాగుతారని పేర్కొంది. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు ఇచ్చారు. విజయకుమార్ రెడ్డి డిప్యుటేషన్ పొడిగింపునకు.. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అంగీకరించడంతో రాష్ట్రప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర సమాచార కమిషనర్ పదవీ కాలం మరో మూడేళ్లు పొడిగింపు - సమాచార కమిషనర్‌గా మరో మూడేళ్లు కొనసాగనున్న తుమ్మ విజయకుమార్ రెడ్డి
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో మూడేళ్లు విజయకుమార్ రెడ్డి డిప్యుటేషన్‌పై అదే పదవిలో కొనసాగే విధంగా ఆదేశాలు వెలువడ్డాయి.
![రాష్ట్ర సమాచార కమిషనర్ పదవీ కాలం మరో మూడేళ్లు పొడిగింపు information commissioner posting extended to vijayakumar reddy, vijayakumar reddy continue as information commissioner for 3 years](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11170456-241-11170456-1616762909253.jpg)
సమాచార కమిషనర్‌గా విజయకుమార్ రెడ్డి పదవీకాలం పొడిగింపు, మరో మూడేళ్లు పదవిలో కొనసాగనున్న సమాచార కమిషనర్