రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న పోర్టులు, రాబోయే ప్రాజెక్టులకు.. ఏపీఐఐసీ భూముల కేటాయింపు గురించి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో.. ఆయా అంశాల ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణను ఉన్నతాధికారులతో చర్చించారు.
ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 'ఒక జిల్లా-ఒక వస్తువు', నైపుణ్యాభివృద్ధి అంశాలపైనా సమావేశంలో మాట్లాడారు.