విజయవాడ ఇంద్రకీలాద్రిపై.. మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు.. పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. శ్రావణపౌర్ణమి రోజున ఈ ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కాలవైపరీత్యాల కారణంగా వచ్చే దోషాల నుంచి విముక్తి కోసం.. సకల దోష నివారణార్ధం ఏటా ఆలయాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తుండడం ఆనవాయితీ.
విశేష శక్తి కలిగిన పవిత్రోత్సవాల వల్ల లోకశాంతి కలుగుతుందని ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాదశర్మ తెలిపారు. కార్యక్రమంలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ, పండితులు పాల్గొన్నారు.