దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మొదటిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా,రెండవ రోజు శ్రీ బాలా త్రిపురసుందరిదేవిగా,మూడో రోజు శ్రీగాయత్రి దేవిగా,నాలుగోరోజు అన్నపూర్ణా దేవిగా,ఐదో రోజు లలితా త్రిముసుందరిగా,ఆరో రోజు శ్రీ మహా లక్ష్మీ దేవిగా,ఏడో రోజు సరస్వతీదేవిగా,ఎనిమిదోరోజు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది.ఈ రోజు మహిషాసురమర్దినిగా కొలువైంది.
శ్రీ మహిషాసురమర్దిని దేవి విశిష్టత...
సింహ వాహనం మీద ఒక చేత త్రిశూలాన్ని ధరించి,మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దుర్గమ్మ దర్శనమిస్తుంది.మహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి.ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.నవరాత్రి దీక్షలో మహర్నవమి మఖ్యమైనది.సాధకులకు నేడు మంత్రసిద్ధి జరిగే రోజని ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు.ఈ మహర్నవమినాడు అమ్మను కొలిచిన వారికి సకల వ్యాధుల బారినుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది.అపమృత్యువును పోగొడుతుంది,పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది.ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిచ్చి,మనిషిలోని దైవీశక్తిని పెంపొందిస్తుంది.
తొమ్మిదో రోజు నైవేద్యం
దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో రూపం ఉన్నట్లే...నైవేద్యం కూడా ప్రతీరోజు ప్రత్యేకంగా ఉంటుంది.అమ్మవారికి ఎనిమిదో రోజు అంటే..ఆశ్వయుజ నవమి-అంటే..ఈ రోజున అమ్మవారికి నువ్వులతో సిద్ధం చేసిన నైవేధ్యాన్ని నివేదించాలి. ఇలా చేస్తే అమ్మవారు కటాక్షిస్తుందని భక్తుల నమ్మకం.