ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం' - ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు న్యూస్

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించామని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్ బాబు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలు సజావుగా నిర్వహించామన్నారు.

ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాం
ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాం

By

Published : Oct 27, 2020, 6:03 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలను సజావుగా నిర్వహించామని వివరించారు. మూలానక్షత్రం రోజున కొండచరియలు విరిగిపడిన ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్... స్వయంగా పరిశీలించి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం సంతోషకరమైన విషయమన్నారు.

కరోనా కారణంగా ఈ సారి భక్తుల రద్దీ తగ్గిందని.. 2 లక్షల 36 వేల 182 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. నవరాత్రుల సందర్భంగా టిక్కెట్లు, లడ్డూ ప్రసాదాలు, పరోక్ష కుంకుమార్చనలు, చీరల వేలం, ఇతర మార్గాల ద్వారా రూ. 4 కోట్ల 36 లక్షల వరకు ఆదాయం వచ్చిందన్నారు. ఉత్సవాలు సజావుగా సాగేందుకు సహకరించిన భక్తులకు ఛైర్మన్, ఈవో ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details