భవాని దీక్ష విరమణ ఉత్సవాలకు... ఇంద్రకీలాద్రి ముస్తాబు - భవానీ దీక్షా విరమణ
భవాని దీక్ష విరమణ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిని ముస్తాబు చేస్తున్నారు. ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనుండగా.... ఐదు లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్నానాలకు ఇబ్బంది లేకుండా...
భవానీలు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించిన అనంతరం ప్రసాదాలు స్వీకరించేందుకు వీలుగా కనకదుర్గనగర్లో 12 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. భవానీలు కేశాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాల వద్ద... కౌంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. తలనీలాలు సమర్పించిన అనంతరం స్నానం చేసేందుకు వీలుగా ప్రకాశం బ్యారేజి దిగువన నదిలో 3.5 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బోర్ల ద్వారా జల్లు స్నానాలకు సైతం సిద్ధం చేశారు.