ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో.. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో సమకాలీన అంశాలపై వారు చర్చించారు.
దేశంలోనే రెండో పొడవైన సమద్ర తీర ప్రాంతం, సమృద్ధిగా సహజ వనరులతో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని.. ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్‌కు.. గవర్నర్ వివరించారు. ఇక్కడి పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఇండోనేషియా నుంచి పెట్టుబడిదారులు రావచ్చని తెలిపారు. అనంతరం గవర్నర్ ఆయనను జ్ఞాపికతో సత్కరించారు. మొదటిసారి రాజ్ భవన్‌కు విచ్చేసిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్ సప్టోనోకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా స్వాగతం పలికారు.
పారాలింపిక్స్‌లో విజేతలకు గవర్నర్ శుభాకాంక్షలు