ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉక్రెయిన్​లో ఉన్నాం.. కాపాడండి సార్​! - కరోనా వైరస్ న్యూస్

ఒకరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 300 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్​లో చిక్కుకున్నారు. కనీసం తిండి లేక ఆకలితోనే గడుపుతున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా వారిని పట్టించుకునే నాథుడే లేడు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఆ విద్యార్థులు. తమను ఎవరైనా కాపాడుతారేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఉక్రెయిన్​లో ఉన్నాం.. కాపాడండి సార్​!
ఉక్రెయిన్​లో ఉన్నాం.. కాపాడండి సార్​!ఉక్రెయిన్​లో ఉన్నాం.. కాపాడండి సార్​!

By

Published : Mar 31, 2020, 2:10 PM IST

ఉక్రెయిన్​లో ఉన్నాం.. కాపాడండి సార్​!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. ఉక్రెయిన్​ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులను భయపెడుతోంది. అక్కడ వందల సంఖ్యలో పాజిటివ్‌ లక్షణాలతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్​లో ఎంబీబీఎస్​ చదివేందుకు వెళ్లిన 1500 మంది భారతీయులు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. వీరిలో 300 మంది తెలుగు విద్యార్ధులూ ఉన్నారు. ఉక్రెయిన్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండడం.... వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్ధులకు లాక్‌డౌన్‌ కారణంగా సరైన ఆహారం లభించక అంతా అవస్థలు ఎదుర్కొంటున్నారు. భారత్​కు తీసుకువచ్చి.. తామంతా ప్రత్యేకంగా స్వీయ రక్షణలో ఉండేందుకు అనువైన రీతిలో చర్యలు తీసుకునేలా చూడాల్సిందిగా ఇండియన్‌ ఎంబసీని కోరుతున్నారు. పట్టించుకోకపోతే.. కరోనా మహమ్మారికి బలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details