ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి'

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణాలు పణంగా పెట్టి చికిత్స చేస్తున్న వైద్యులపై కొంతమంది దాడులు చెయ్యడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండించింది. ఇకపై దాడులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టం తీసుకురావాలని ఐఎంఏ డిమాండ్ చేసింది.

వైద్యులపై దాడిని ఖండించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
వైద్యులపై దాడిని ఖండించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

By

Published : Apr 23, 2020, 8:04 AM IST

వైద్యులపై దాడిని ఖండించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

వైద్యులపై జరుగుతున్న దాడులను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణాలకు తెగించి వైద్యులు చికిత్స చేస్తుంటే... కొంతమంది దాడులు చేయటం వైద్యుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపై దాడులు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా దేశవ్యాప్తంగా చట్టం తేవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. గురువారం వైద్యులంతా విధులు నిర్వహిస్తూనే నిరసన తెలుపనున్నట్లు ఐఎంఏ రాష్ట్ర కొవిడ్​-19 ప్రతినిధి డా.కార్తీక్​ పేర్కొన్నారు. విశాఖలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను దాచిపెడుతున్నారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధి డా.జయధీర్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:'వైద్యులపై దాడి చేయడమంటే... కూర్చొన్న కొమ్మను నరికేయడమే'

ABOUT THE AUTHOR

...view details