విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరోసారి స్పందించింది. వైద్యులపై నిందలు వేయడం సరికాదని అభిప్రాయపడుతూ ప్రకటన విడుదల చేసింది. ప్రమాద ఘటనలో డాక్టర్ రమేశ్ ఆసుపత్రి వైద్యులపై కేసులు బనాయించడాన్ని తప్పుపడుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి ఇప్పటికే లేఖ రాశామని ఐఎమ్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణిధర్ తెలిపారు. ఘటనలో ప్రభుత్వ అధికారుల బాధ్యతారాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో కోరామన్నారు.
వైద్యులపై నిందలు వేయడం సరికాదు : ఐఎమ్ఏ
విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై ఐఎమ్ఏ మరోసారి స్పందించింది. వైద్యులపై నిందలు వేయడం సరికాదని పేర్కొంది. ప్రమాద ఘటనపై ప్రభుత్వ అధికారుల బాధ్యతారాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డీజీపీ రాసిన లేఖలో కోరామని తెల్పింది. నిర్విరామంగా పనిచేసే వైద్యులపై అక్రమార్జన అభియోగాలు, నేరారోపణలు చేయటం సరికాదని అభిప్రాయపడింది.
వైద్యులపై నిందలు వేయడం సరికాదు : ఐఎమ్ఏ
విపత్తుల నిర్వహణ శాఖ సంఘటనా స్థలానికి దగ్గరలోనే ఉంటుందని, 20 ఏళ్ల పని విధానం అభ్యంతరకరంగా ఉందని ఆయన ప్రకటనలో తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రోజుల తరబడి నిర్విరామంగా పనిచేసే వైద్యులపై అక్రమార్జన అభియోగాలు, నేరారోపణలు చేయటం సరికాదన్నారు.
ఇదీ చదవండి :చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి