ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలోనే పంద్రాగస్టు వేడుకలు... ఉత్తర్వులు జారీ - ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 2020

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నిబంధనల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Independence Day celebrations-2020
Independence Day celebrations-2020

By

Published : Aug 6, 2020, 10:00 PM IST

రాష్ట్రంలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్‌ నీలం సాహ్ని. కరోనా నిబంధనల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. వివిధ శాఖలు తమ పథకాలతో కూడిన శకటాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ దృష్ట్యా ఆహ్వానితులను పరిమితం చేయాలని సూచించారు. విజయవాడ ఎంజీ రోడ్డును అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details