ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు - vijayawada corona positive cases latest news

విజయవాడలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. నగరంలో ఇప్పటి వరకు 120కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరైనా మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

విజయవాడలో భద్రత మరింత కట్టుదిట్టం
విజయవాడలో భద్రత మరింత కట్టుదిట్టం

By

Published : Apr 26, 2020, 7:59 PM IST

విజయవాడలో భద్రత మరింత కట్టుదిట్టం

విజయవాడ నగరంలో 120కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రెడ్​జోన్ల వద్ద ఏపీ ఎస్డీఆర్​ఎఫ్​తో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. కృష్ణలంకలోని రెడ్​జోన్​ ప్రాంతంలో పోలీసులు అదనపు బలగాలు, వాహనాలతో కవాతు చేశారు. సామూహికంగా సమావేశాలు నిర్వహించటం వల్లే కరోనా వ్యాప్తి జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. రెడ్​జోన్​ ప్రాంతాల్లో పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో మా ప్రతినిధి పూర్తి వివరాలు అందిస్తారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details