ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 25, 2020, 4:59 AM IST

ETV Bharat / city

ఆర్టీసీకి పెరుగుతున్న ప్రయాణికులు...

కరోనా లాక్‌డౌన్‌ సడలింపులు ఊపందుకున్న నేపథ్యంలో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆక్యుపెన్సీ శాతం, రాబడిలోనూ పురోగతి కనిపిస్తోంది.

ఆర్టీసీకి పెరుగుతున్న ప్రయాణికులు...
ఆర్టీసీకి పెరుగుతున్న ప్రయాణికులు...

లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22 నుంచి 11 వేల బస్సులను నిలిపేశారు. మే 21న 1,700 బస్సులను తిప్పడం ప్రారంభించారు. ఆ సంఖ్యను క్రమంగా పెంచుతూ ప్రస్తుతం 3,800కు తీసుకొచ్చారు. శనివారం నుంచి సిటీ, సబర్బన్‌ సర్వీసులు కూడా అందుబాటులోకి రావడంతో సర్వీసుల సంఖ్య 4,500కు చేరింది. గతంలో సగటున రోజుకు 42 లక్షల కి.మీ.మేర బస్సులు నడుస్తుండగా, ఈ సంఖ్య ప్రస్తుతం 19 లక్షల కి.మీ.కు (45 శాతం) చేరింది.

  • రూ.2,968 కోట్ల నష్టం
    సాధారణ రోజుల్లో ఆర్టీసీకి నిత్యం రూ.13.5 కోట్లు సగటు రాబడి ఉండేది. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలతో రూ.16 కోట్ల వరకు రావల్సి ఉంది. కరోనా నేపథ్యంలో జూన్‌ నెలలో రూ.2 కోట్లు, జులైలో రూ.1.7 కోట్లు, ఆగస్టులో రూ.2 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. ఈ నెలలో ఇప్పటి వరకు సగటున రూ.3.63 కోట్లకు చేరింది. సర్వీసులు పునరుద్ధరించినప్పటి నుంచి ఈ నెలలోనే కాస్త ఆశాజనకమైన వాతావరణం కనిపించిందని అధికారులు పేర్కొంటున్నారు.
    *ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్‌) గత నెల వరకు 47-48 శాతం ఉండేది. ఈ నెలలో 52 శాతానికి చేరింది.
    *సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఓఆర్‌ 59 శాతం వరకు ఉంది. పల్లె వెలుగు బస్సుల్లో మొన్నటి వరకు ఓఆర్‌ 45 శాతంలోపు ఉండగా, ఇప్పుడది 53 శాతానికి చేరింది.
    *లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ రూ.2,968 కోట్లు (దాదాపు రూ.3 వేల కోట్లు) నష్టపోయింది. తెలంగాణకు సర్వీసులు లేకపోవడంతో నిత్యం సగటున రూ.కోటిన్నర కోల్పోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details