కార్మికులకు గతంలో ఉండే 30 లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని ఆర్టీసీ యాజమాన్యం 40 లక్షలకు పెంచింది. ప్రమాదాల వలన పూర్తి అంగ వైకల్యం కలిగిన ఉద్యోగికి అదనంగా 30 లక్షల బీమా సదుపాయం కల్పించింది. కేవలం నెలకు 200 రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రతి ఉద్యోగికి సహజ మరణం పొందిన సందర్భంలోనూ బీమా సదుపాయం కల్పించారు. ఇవికాక పిల్లల చదువుల నిమిత్తం రుణాలు 5 లక్షలు, ఆడపిల్లల వివాహ రుణం 2 లక్షలు మాఫీ చేస్తారని.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ మెరుగైన శాలరీ పథకం జూలై 12 నుంచి అమలులోకి వచ్చిందని తెలిపారు. ఉద్యోగులందరూ కూడా సంస్థ అభివృద్ధికి, ప్రయాణికుల పట్ల నాణ్యమైన సేవలు అందించేలా చూడాలని అధికారులను ఎండీ ఆదేశించారు. సంస్థ ఉద్యోగులు, అసోసియేషన్ ప్రతినిధులు ఈ పథకం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
APSRTC: ఆర్టీసీ కార్మికులకు ప్రమాద బీమా పెంపు - ఆర్టీసీ కార్మికులకు ప్రమాద బీమా పెంపు వార్తలు
ఆర్టీసీ కార్మికులకు గతంలో ఉండే 30 లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయాన్ని 40 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై సంస్థ ఉద్యోగులు, అసోసియేషన్ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికులకు ప్రమాద బీమా పెంపు
Last Updated : Aug 29, 2021, 7:09 AM IST