ముఖ్యమంత్రి చేతుల మీదుగా కడప, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో స్కిల్ కాలేజీల ప్రారంభోత్సవం జరగనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. 30 కళాశాలల పర్యవేక్షణకు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధిపై సమీక్ష చేసిన మంత్రి.. అన్ని కళాశాలల లేఔట్లకు తుది మెరుగులు దిద్దుతున్నట్టు స్పష్టం చేశారు.
'అక్టోబర్లో 30 స్కిల్ కాలేజీల ప్రారంభోత్సవం' - skill development programme
అక్టోబర్లో 30 నైపుణ్య కళాశాలలను లాంఛనంగా ప్రారంభించనున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

అక్టోబర్ లో 30న స్కీల్ కాలేజీల ప్రారంభోత్సవం
ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా సీఎస్ఆర్ నిధుల సమీకరణపై మరింత దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఉద్యోగావకాశాలుండే 20 కోర్సులపై అధ్యయనం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హై లెవల్ కమిటీ, ఐఎస్ బీ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి అందిస్తామని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన కోర్సులు, మానవవనరుల వివరాలపై సర్వేకు నైపుణ్యశాఖ సిద్ధం కావాలన్నారు.
ఇదీ చదవండికోడూరు మండలంలో పోలీసుల దాడులు.. మూడు వేర్వేరు కేసులు నమోదు