ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెలుగు సాహిత్యంలో ఇనాక్​ది కొత్త ఒరవడి' - Telugu Literature

ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకులు ఆచార్య కొలకలూరి ఇనాక్... తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడిని సృష్టించారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వ్యాఖ్యనించారు. ఆయన రాసిన మనూళ్లలో మా కథలు అనే పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించారు.

తెలుగు సాహిత్యంలో ఇనాక్ కొత్తవరవడి సృష్టించారు

By

Published : Aug 12, 2019, 11:55 PM IST

తెలుగు సాహిత్యంలో ఇనాక్ కొత్తవరవడి సృష్టించారు

ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకులు ఆచార్య కొలకలూరి ఇనాక్ రాసిన మనూళ్లలో మాకథలు అనే పుస్తకాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఐపీఎస్ అధికారి సత్యనారాయణ ఆవిష్కరించారు. విజయవాడలోని ఓ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్యంలో ఇనాక్ కొత్త ఒరవడి సృష్టించారని.. ఆయన రాసిన ఎన్నో కథలు, నాటకాలు జనబాహుళ్యంలో విశేష ఆదరణ పొందాయని వక్తలు కొనియాడారు. ఇదే కార్యక్రమంలో కొలకలూరి ఇనాక్ జీవితంపై.. మరో రచయిత విహారి రచించిన అద్వితీయ పుస్తకాన్నీ అతిథులు ఆవిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details