ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Apartments In Vijayawada: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా.. ఆ అపార్ట్‌మెంట్లు

Apartments In Vijayawada: అసాంఘిక కార్యకలాపాలకు పలు అపార్ట్​మెంట్లు అడ్డాగా మారుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా అపార్ట్‌మెంట్‌ గదులను అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వీటిని కొనసాగిస్తున్నారు. లాడ్జీలు, హోటళ్లపై నిఘా ఉంటుందని.. అపార్ట్‌మెంట్లలో అయితే పెద్దగా అనుమానం రాదనే కారణంతో వీటిని ఎంచుకుంటున్నారు. మరి ఇంత జరుగుతుంటే పోలీసులకు ఏం తెలియదా? అనే అనుమానం రావచ్చు. అయితే కొందరు పోలీసు సిబ్బంది నెలవారీ మామూళ్లకు కక్కుర్తి పడటం, వారికి తెలిసే ఈ వ్యవహారం సాగుతోందనే విమర్శలూ ఉన్నాయి. మరి ఇంతకీ ఏం జరుగుతోందో మీరే చూడండి.

Apartments In Vijayawada
విజయవాడ అపార్ట్‌మెంట్లలో అక్రమాలు

By

Published : Mar 7, 2022, 2:05 PM IST

విజయవాడ అపార్ట్‌మెంట్లలో అక్రమాలు

Illegal activities in Apartments: విజయవాడలోని పలు సర్వీసు అపార్ట్‌మెంట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా అపార్ట్‌మెంట్‌ గదులను అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వీటిని కొనసాగిస్తున్నారు. యువతీ, యువకులకు గంటల చొప్పున అద్దెకు ఇస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఈ విష సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల ఓ ప్రేమ జంట కేసు విచారణ సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎక్కువ ఆదాయం కోసం..

ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఆశతో జూదం, వ్యభిచారం, తదితర వ్యవహారాలు నడిపే వారికి ఫ్లాట్లను అద్దెకు ఇస్తున్నారు. గంటకు 2 నుంచి 3 వేల రూపాయల వరకు డిమాండ్‌ను బట్టి వసూలు చేస్తున్నారు. వీటిలో సకల సదుపాయాలు సమకూరుస్తున్నారు. బిర్యానీ, శీతల పానీయాలు, మద్యం సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా ఈ ఫ్లాట్లకు ప్రేమికులే వస్తుంటారని.. ఈ వ్యవహారం అంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని తెలుస్తోంది. లాడ్జీలు, హోటళ్లపై నిఘా ఉంటుందని అపార్ట్‌మెంట్లలో అయితే పెద్దగా అనుమానం రాదనే కారణంతో వీటిని ఎంచుకుంటున్నారు. కొందరు పోలీసు సిబ్బంది నెలవారీ మామూళ్లకు కక్కుర్తి పడటం, వారికి తెలిసే ఈ వ్యవహారం సాగుతోందనే విమర్శలూ ఉన్నాయి.

ఇటీవల ఓ ప్రేమజంట వ్యవహారంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె నుంచి వివరాలు రాబట్టారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను పలు అపార్ట్‌మెంట్లకు తీసుకెళ్లాడని యువతి చెప్పడంతో ఆ అపార్ట్‌మెంట్ల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

యువతి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పటమట స్టేషను పరిధిలోని 5, భవానీపురం స్టేషను పరిధిలోని ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లను గుర్తించారు. ఇలాంటి కార్యకలాపాలు ఇంకా ఎక్కడైనా జరుగుతున్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆ ఫ్లాట్లకు ఎంత మంది వెళ్తున్నారు? ఏ రకమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు? తదితర అంశాలపై దృష్టి సారించారు. ఆయా ఫ్లాట్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయో వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్న చోట్ల వాటిల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి:

తెదేపా నేతల వాహనాలను అడ్డుకున్న పోలీసులు.. కార్యకర్తల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details