ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని.. దసరా పండుగని ముగించుకొని భక్తులు తిరుగు పయనమయ్యారు. దీంతో విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. పెద్ద ఎత్తున ప్రయాణికులతో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ జనసంద్రంగా మారింది. రద్దీని తగ్గించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ పలు ప్రాంతాలకు పండుగ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
విజయనగరం, విశాఖపట్నంతో పాటు రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆయా ప్రాంతాల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపిన ఆర్టీసీ..కొవిడ్ నిబంధలు పాటిస్తూనే సర్వీసులను నడుతున్నామని తెలిపారు. బస్టాండ్లో ఎక్కడా గుమిగూడకుండా ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు, తమ సిబ్బంది ద్వారా కొవిడ్ నిబంధనలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. అటు రైల్వేశాఖ సైతం ప్రత్యేక సర్వీసులను దూరప్రాంతాలకు నడుపుతోంది.