ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సౌకర్యాలు సమకూర్చకపోతే జైలులో ఆమరణ దీక్షకు సిద్ధం: ప్రొఫెసర్​ సాయిబాబా - జైలులో ప్రొఫెసర్ సాయిబాబా దీక్ష వార్తలు

ఖైదీలకు ఔషధాలు, సౌకర్యాలు అందించాలనే డిమాండ్‌తో ఈనెల 21నుంచి జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రొఫెసర్​ జీఎన్​ సాయిబాబా వెల్లడించారు. ఈమేరకు నాగ్‌పూర్‌ కేంద్ర కారాగారం అధికారులకు నోటీసు ఇచ్చినట్లు ప్రొఫెసర్​ జి.హరగోపాల్‌, కె.రవిచందర్‌ తెలిపారు.

సౌకర్యాలు సమకూర్చకపోతే జైలులో ఆమరణ దీక్షకు సిద్ధం: ప్రొ.సాయిబాబా
సౌకర్యాలు సమకూర్చకపోతే జైలులో ఆమరణ దీక్షకు సిద్ధం: ప్రొ.సాయిబాబా

By

Published : Oct 19, 2020, 3:24 PM IST

ఖైదీలకు ఔషధాలు, పుస్తకాలతో పాటు కుటుంబీకులు రాసిన లేఖలను అందించాలనే డిమాండ్‌తో జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ప్రొఫెసర్​ జీఎన్‌ సాయిబాబా నిర్ణయించారు. దీనిపై ‘కమిటీ ఫర్‌ ది డిఫెన్స్‌ అండ్‌ రిలీజ్‌ ఆఫ్‌ డా.జీఎన్‌ సాయిబాబా’ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 21 నుంచి ఆమరణ దీక్షకు సిద్ధమని పేర్కొంటూ సాయిబాబా నాగ్‌పుర్‌ కేంద్ర కారాగారం అధికారులకు నోటీసు ఇచ్చినట్లు కమిటీ ఛైర్మన్‌ ప్రొ.జి.హరగోపాల్‌, కన్వీనర్‌ కె.రవిచందర్‌ తెలిపారు.

90శాతం అంగవైకల్యంతో బాధపడుతూ జైలు జీవితం గడుపుతున్న సాయిబాబాకు సరైన వైద్యసాయం అందించకపోవడమే కాకుండా ఔషధాలివ్వడంలోనూ జాప్యం చేస్తున్నారన్నారు. గత ఆగస్టులో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకూ పెరోల్‌ మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details