"భాజపా- వైకాపా లాలూచీలు" - విజయవాడ
చంద్రబాబును ఇబ్బందిపెట్టడానికే భాజపా-వైకాపా లాలూచీలు.... బుద్దా వెంకన్న
బుద్దా వెంకన్న
ప్రధాని మోదీ పాలనను పక్కన పెట్టి చంద్రబాబుని ఇబ్బందిపెట్టడం పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న అన్నారు. కన్నా లక్ష్మీ నారాయణ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు ఇవ్వటం వైకాపా, భాజపాల మధ్య లాలూచీలో భాగమేనని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలి కానీ ఫిర్యాదుల సాకుతో భాజపా అనుకూల అధికారులను ఏపీలో పెట్టాలని చూస్తోందని బుద్దా ఆరోపించారు.