రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. విజయవాడలో కరోనా నియంత్రణ చర్యలపై క్యాంపు కార్యాలయం నుంచి ఆమె అధికారులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, కర్నూలు నగరాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో... ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రెడ్జోన్లలో మెడికల్ క్యాంపులు, ఫీవర్ క్లినిక్లను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలను పెంచాలని చెప్పారు. నిత్యావసరాలను ఇంటికే పంపిణీ చేయాలని సూచించారు.
'కంటైన్మెంట్ను మరింత పటిష్టంగా అమలు చేయండి' - విజయవాడలో లాక్డౌన్ వార్తలు
రెడ్జోన్లలో ఆంక్షలు కఠినతరం చేయాలని సీఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విజయవాడలో కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచాలని.... లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
cs neelam sahni