ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MONSOON: బంగాళాఖాతంలో మరింతగా విస్తరించిన నైరుతీ రుతుపవనాలు.. - అండమాన్ శ్రీలంక పరిసరాల్లో విస్తరించిన రుతుపవనాలు

MONSOON: బంగాళాఖాతంలో నైరుతీ రుతుపవనాలు..... మరింతగా విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రతలతో పాటు ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవనాల ప్రవేశానికంటే ముందుగా కేరళ, దక్షిణ కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో వచ్చే 4-5 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

MONSOON
బంగాళాఖాతంలో మరింతగా విస్తరించిన నైరుతీ రుతుపవనాలు

By

Published : May 17, 2022, 8:53 AM IST

MONSOON: బంగాళాఖాతంలో నైరుతీ రుతుపవనాలు మరింతగా విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రతలతో పాటు ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతాలతో పాటు అండమాన్ దీవులు, శ్రీలంక పరిసర ప్రాంతాలకూ రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు రుతుపవనాల ప్రవేశానికంటే ముందుగా కేరళ, దక్షిణ కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో వచ్చే 4-5 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో....పశ్చిమ వాయవ్య, మధ్య భారత్‌పై ఉష్ణగాలుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టినట్టు ఐఎండీ తెలిపింది. వచ్చే 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్టు వాతావరణ శాఖ వివరించింది. విధర్భ, కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం ఉష్ణగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో తీవ్రస్థాయిలోనే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details