ఆగిరిపల్లి ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న లక్ష రూపాయల విలువైన తెలంగాణ మద్యాన్ని మైలవరం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న ద్విచక్రవాహనాలను అదుపులోకి తీసుకుని.. ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డేగ ప్రభాకర్ హెచ్చరించారు. మద్యం తరలింపు చేపడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. మద్యం తరలిస్తున్న వాహనాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎక్సైజ్ ఎస్ఐ బాలాజీ, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
ఆదోనిలో..
ఇన్నోవా వాహనంలో సీట్ల కింద ఎవరికి కనపడకుండా కర్ణాటక మద్యం రవాణా చేస్తున్న 1078 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పురపాలక ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని మెదేరగెరిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. ఇన్నోవాలో తరలిస్తున్న అక్రమ మద్యాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. అక్రమంగా రవాణా చేస్తున్న 1078 మద్యం టెట్రా ప్యాకెట్లను, ఇన్నోవాను పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. మద్యం కొనే ఇద్దరిని.. మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ఇదీ చదవండి:
కరోనాకు సింహద్వారంగా మద్యం దుకాణాల పర్మిట్ రూంలు