రిజర్వేషన్ల ఖరారు విషయంలో అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వం నుంచి పరిహారం కోరాలని హైకోర్టు స్పష్టంచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల రొటేషన్ పద్ధతిని సక్రమంగా పాటించనందున... ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన స్థానాలు ఇతరులకు చెందాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది... ప్రభుత్వం అనుసరించిన విధానంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు కావాల్సిన స్థానాలు ఇతర సామాజిక వర్గాలకు దక్కాయన్నారు. రొటేషన్ పద్దతిలో ఈసారి తమకు రిజర్వు దక్కతుందనుకున్న ఎస్సీ, ఎస్టీలకు నిరాశ మిగిలిందని వివరించారు. ఎన్నికల ప్రక్రియను తాము నిలువరించబోమన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం... రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరం లేదంటూ 6 వారాల పాటు వాయిదా వేసింది.
'అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వం నుంచి పరిహారం కోరండి' - ఎన్నికల తాజా వార్తలు
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు విషయంలో అధికారులు తప్పు చేస్తే..ప్రభుత్వం నుంచి పరిహారం కోరాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను తాము నిలవరించబోమన్న ధర్మాసం...ఈ అంశంపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
హైకోర్టు