ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతి ఉద్యమం లేకపోతే... వేలాదిగా పోలీసులు ఎందుకు?' - అమరావతిపై బొండా కామెంట్స్

విశాఖ భూములు కొల్లగొట్టేందుకే అమరావతి ఉద్యమంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా మండిపడ్డారు. అమరావతి ఉద్యమం అనేది బూటకమయితే వేలాదిగా పోలీసులను ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు.

అమరావతి ఉద్యమం లేకపోతే...వేలాదిగా పోలీసులు ఎందుకు
అమరావతి ఉద్యమం లేకపోతే...వేలాదిగా పోలీసులు ఎందుకు

By

Published : Oct 12, 2020, 9:27 PM IST

అమరావతి ఉద్యమం అనేది బూటకమయితే వేలాదిగా పోలీసులను ఎందుకు పెట్టారో ప్రభుత్వ సలహాదారు సజ్జల సమాధానం చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా డిమాండ్ చేశారు. విశాఖ భూములు కొల్లగొట్టేందుకే ఉద్యమంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో 15 నెలల్లో 72 వేల రిజిస్ట్రేషన్లు జరగటం నిజమైన ఇన్ సైడర్ ట్రేడింగ్ అని దుయ్యబట్టారు.

కేంద్రం పంపిన కందిపప్పు, బియ్యాన్ని ప్రభుత్వం మాయం చేసిందని ఆరోపించారు. 4 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతింటే రైతులను పట్టించుకోవట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంలో వేలాది కోట్ల ముడుపులు వసూలు చేసి.. అవినీతిని కప్పిపెట్టుకోవటానికే లోకేశ్​పై సజ్జల నిందలు మోపుతున్నారుని ఆయన విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details