Durga Temple News: విజయవాడ దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుకలు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవస్థానానికి చెందిన ఓ చిరుద్యోగే ఈ పని చేసినట్టు నిర్ధరించారు. కొద్ది రోజుల కిందట మహామండపం ఆరో అంతస్తులోని బాత్‌రూంలో ఉన్న బంగారు ఆభరణాల ప్యాకెట్‌ను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఈవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వన్‌టౌన్ పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 110మంది సేవకులు, ఉద్యోగులు లెక్కింపులో పాల్గొన్నారని తెలిపారు. నిందితుడి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుకలు కాజేసిన వ్యక్తి గుర్తింపు - దుర్గగుడి చోరీకి పాల్పడిన వ్యక్తి
విజయవాడ దుర్గగుడిలో హుండీల లెక్కింపులో కానుకలు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవస్థానానికి చెందిన ఓ ఉద్యోగే ఆ కానుకలను దొంగిలించినట్లు నిర్ధరించారు.
దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుకలు కాజేసిన వ్యక్తి గుర్తింపు