ఇసుక రీచ్ ల తరహాలోనే మైనింగ్ నిర్వహణను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆర్ధిక , న్యాయశాఖల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. విశాఖ,తిరుపతి, విజయవాడ నగరాల్లో స్వాధీనం చేసిన ల్యాండ్ సీలింగ్ భూములపై మంత్రుల కమిటీ సమావేశంలో చర్చించినట్టు పెద్దిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ శాశ్వత భూహక్కు- భూరక్ష పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. భూసర్వే ప్రక్రియలో అన్ని రకాల భూములనూ సర్వే చేస్తామని స్పష్టం చేశారు. కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.
Mining Privatization :'మైనింగ్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచన' - ఏపీలో మైనింగ్ వార్తలు
ఇసుక రీచ్ ల తరహాలోనే మైనింగ్ నిర్వహణను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
మైనింగ్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచన...
2023 మార్చి నాటికి సమగ్ర భూ సర్వే ప్రాజెక్టు పూర్తి అవుతుందని మంత్రి అన్నారు. భూ తగాదాలు, ఈనాం భూముల సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల పర్యవేక్షణలోనే సర్వే చేపడుతున్నట్టు వివరించారు.
ఇదీ చదవండి: 'వెనకబడిన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడమే వైకాపా లక్ష్యం'