IAS Officers Union Responds: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఐఎఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌పై ప్రభుత్వ ఉద్యోగి సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు ఐఎఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సీఎస్ పాలనా అధిపతి అని... అన్ని సంఘాలు, ఉద్యోగుల పట్ల సీఎస్ బాధ్యతగానే ఉంటారని సంఘం స్పష్టం చేశారు.
వృత్తిపరంగా నిష్పాక్షికంగానే ఉన్నతాధికారులు వ్యవహరిస్తారని తెలుసుకోవాలని పీఎస్ ప్రద్యుమ్న హితవు పలికారు. సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ.. సీఎస్‌పై చేసిన ఆరోపణలు తగవని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని ఐఎఎస్‌ల సంఘం ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.