ఎస్ఈసీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఆయన సేవల్ని అటవీ, పర్యావరణ శాఖలోని కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగానూ, అలాగే ఎక్సైజ్ శాఖ కమిషనర్ అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లో మార్పులు - ap govt oredrs issued for ias officers trasnfer
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్‌ను నియమిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.
పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లో మార్పులు
మరోవైపు ఎక్సైజు శాఖ కమిషనర్ బాధ్యతల్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్‌కు అప్పగించారు. అలాగే రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ బాధ్యతల్ని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మికి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇక అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా ఉన్న జీఎస్ఆర్ కేఆర్ విజయకుమార్‌కు కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చదవండి: నాడు-నేడు.. నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్