ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల సంఘంతో సమావేశానికి వైకాపా దూరం

ఎస్​ఈసీ నిర్వహించే సమావేశానికి వైకాపా హాజరు కావటం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైకాపాకి, ముఖ్యమంత్రి జగన్​కు వ్యతిరేకంగా గతంలో కేంద్రానికి లేఖ రాసిన ఎస్ఈసీ నిమ్మగడ్డతో ముఖాముఖి సమావేశానికి హాజరు కాకూడదనేది తమ పార్టీ నిర్ణయమన్నారు.

రేపటి ఎస్​ఈసీ సమావేశానికి హాజరు కాబోం
రేపటి ఎస్​ఈసీ సమావేశానికి హాజరు కాబోం

By

Published : Oct 27, 2020, 10:16 PM IST

Updated : Oct 28, 2020, 12:47 AM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే రాజకీయ పార్టీల సమావేశానికి హాజరు కాకూడదని వైకాపా నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటన జారీచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉందో లేదో ప్రభుత్వం అభిప్రాయం తీసుకోకుండా కనీసం సీఎస్, వైద్యశాఖ ఉన్నతాధికారుల సూచనలు తీసుకోకుండా ఈ సమావేశం నిర్వహించడం సరికాదని వైకాపా అభిప్రాయం వ్యక్తం చేసింది. గతంలో వైకాపా, పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్​కు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసిన ఎస్​ఈసీ నిమ్మగడ్డతో ముఖాముఖి సమావేశానికి హాజరు కాకూడదని తమ పార్టీ నిర్ణయమని అంబటి ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఒక్క ఓటు, సీటు కూడా లేని రాజకీయ పార్టీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించిన ఎస్​ఈసీ దురుద్దేశాలు త్వరలోనే బయట పడతాయని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా ప్రభుత్వానికి తెలియచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా వాటిని ఎస్​ఈసీ బేఖాతరు చేస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారని వైకాపా ఆరోపించింది.

Last Updated : Oct 28, 2020, 12:47 AM IST

ABOUT THE AUTHOR

...view details