కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణను నేరుగా కలిసే అవకాశం తనకు దక్కటం ఎంతో అదృష్టమని రైల్వే డీజీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ 44వ వర్థంతి సందర్భంగా ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
'కవిసామ్రాట్ను కలిసే అవకాశం రావటం నా అదృష్టం' - kavisamrat viswanatha satyanarayana news
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన కిన్నెరసాని పాటలపై ఆయన మనవరాలు సుశీలమ్మ రాసిన సమీక్ష గ్రంథాన్ని ఆదివారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీజీ ద్వారకా తిరుమలరావు పాల్గొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
dwaraka tirumala rao
కిన్నెరసాని పాటలపై విశ్వనాథ సత్యనారాయణ మనమరాలు సుశీలమ్మ రాసిన సమీక్ష గ్రంథాన్ని మాజీ డీజీపీ అరవిందరావు వెబినార్ ద్వారా ఆవిష్కరించారు. కిన్నెర ఉపనది గోదావరిలో కలిసే అంశాన్ని ఓ యువతి ఇంటి నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందో.. ఎన్ని కష్టాలు ఎదురవుతాయో వివరిస్తూ కిన్నెరసాని పాటలు విశ్వనాథ రచించారని సుశీలమ్మ తెలిపారు. విజయవాడలోని కవిసామ్రాట్ గృహం వద్ద సమీక్ష గ్రంథాన్ని ఆవిష్కరించారు.